: ఎన్జీరంగా యూనివర్శిటీకి జయశంకర్ యూనివర్శిటీగా నామకరణం
హైదరాబాదులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అటు శ్రీవెంకటేశ్వర వెంటర్నరీ యూనివర్శిటీ పేరును పీవీ నర్సింహారావు తెలంగాణ స్టేట్ వర్సిటీగా నామకరణం చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాక రాజేంద్రగనర్ లో పీవీ పేరుతో యూనివర్శిటీ ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.