: అల్పపీడనం... తీరం దాటి, ఒడిశా వైపు వెళ్లిపోయింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటిందని, ప్రస్తుతం ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోందని వాతావారణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఇది బలహీనపడే అవకాశం ఉందని, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావారణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు చెప్పారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.