: ఏపీ సీఎస్ తో ముగిసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ భేటీ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి భేటీ ముగిసింది. త్వరలో జరగనున్న ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఈ సమావేశంలో చర్చించారు. కాగా, రేపు (శుక్రవారం) సుప్రీంకోర్టులో ఉన్నత విద్యామండలి ఇంప్లీడ్ పిటిషన్ వేయనుంది. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణపై రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News