: రేపు తెలంగాణలో కోర్టులు బంద్
శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని కోర్టుల బంద్ కు లాయర్ల జేఏసీ పిలుపునిచ్చింది. ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ వరంగల్ జిల్లా లాయర్ల జేఏసీ ఇవాళ హైదరాబాదులోని హైకోర్టు వద్ద ఆందోళన బాట పట్టింది. ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై లాయర్ల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు నిరసనగా రేపు తెలంగాణవ్యాప్తంగా న్యాయస్థానాల బంద్ కు పిలుపునిచ్చింది.