: నట్వర్ సింగ్ ఏం మాట్లాడుతున్నారు?... నా ఆత్మకథ నేనే రాస్తా: సోనియా


సోనియాను ప్రధానిని కాకుండా అడ్డుకున్నది రాహుల్ గాంధీయేనంటూ కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. ఢిల్లీలో ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ‘ఎవరికి నచ్చినట్టు వారు వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు నేనే నా జీవిత కథ రాస్తా’నని సోనియా గాంధీ స్పష్టం చేశారు. అప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. కాగా, నట్వర్ జీవిత చరిత్ర 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్' విడుదల కాకముందే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన నట్వర్ సింగ్ ఇంకెన్ని వివాదాస్పద అంశాలను వెలుగులోకి తెస్తారోనని నేతలు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News