: తెలుగమ్మాయి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో చార్జిషీటు దాఖలు
కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసి అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న ఎస్తేర్ అనూహ్య జనవరిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. జనవరి 4వ తేదీన ముంబై వెళ్లిన ఆమె ఆచూకీ తెలియకుండా పోయింది. అనూహ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా... అన్వేషణ ప్రారంభించిన 12 రోజుల తర్వాత జనవరి 16వ తేదీన ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఏడు నెలలుగా మిస్టరీగా మిగిలిన ఎస్తేర్ అనూహ్య కేసును పోలీసులు ఛేదించారు. ముంబై సమీపంలోని లోక్ సభ తిలక్ టెర్మినల్ లో తెల్లవారుజామున ఆమె రైలు దిగింది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి, అనూహ్యను వెంటబెట్టుకువెళ్లిన చంద్రభాను ఈ కేసులో హంతకుడని పోలీసులు ఇంతకు ముందే తేల్చారు. ఈ కేసును మరింత లోతుగా విచారించిన అనంతరం నిందితుడిపై 201, 302, 376, 376-ఎ, 201 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనూహ్య హత్యకేసుకు సంబంధించి ఈ మేరకు ఛార్జిషీటు దాఖలు చేశారు.