: ఏపీలో రుణమాఫీ అమలుకు త్రిసభ్య కమిటీ
ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ వనరుల సమీకరణకు ఏపీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అధ్యక్షతన ఈ కమిటీని సీఎం చంద్రబాబు నియమించారు. ఇందులో సుజనాతో పాటు కెనరా బ్యాంక్ మాజీ సీఎండీ ఎంబీఎన్ రావు, కమిటీలో సభ్య కన్వీనర్ గా ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఉంటారు. రాష్ట్రంలో వనరుల గుర్తింపు, వినియోగంపై ఈ కమిటీ ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.