: ఎంసెట్ కౌన్సిలింగ్ పై ఉన్నతవిద్యామండలి ఛాంబర్ వద్ద ఓయూ విద్యార్థుల ఆందోళన
ఎంసెట్ కౌన్సిలింగ్ లో భాగంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని ఉన్నతవిద్యామండలి చైర్మన్ ఛాంబర్ దగ్గర ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగటంలో... కౌన్సిలింగ్ ప్రకటన కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు మాత్రమే వర్తిస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓయూ విద్యార్థి నేతలకు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతవిద్యామండలి చైర్మన్ తోనే చెప్పించాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.