: కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసిన టీడీపీ బృందం
టీడీపీ బృందం ఈ రోజు ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసింది. 2017 జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని ఆ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, 2017లో రాష్ట్రంలో జాతీయ క్రీడల నిర్వహణకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. క్రీడల నిర్వహణకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాల్సి ఉందన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్ లకు ప్రోత్సహకాలు ఇస్తామని తెలిపారు.