: చంద్రబాబు, కేసీఆర్ లు కలిసి చర్చించుకోవాలి: డొక్కా
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కార మార్గాన్ని వెతకడానికి ప్రయత్నించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సూచించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం 1956 ఆధారంగా స్థానికతను నిర్ధారించాలనుకోవడం సరికాదని అన్నారు. కేవలం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే టీఎస్ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ సమస్య పరిష్కారంలో గవర్నర్ నరసింహన్ కూడా జోక్యం చేసుకోవాలని అన్నారు.