: మన వాళ్ళు ఔటవుతుంటే...గవాస్కర్ హర్టయ్యాడు!


సౌతాంప్టన్ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శన మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. భారత్ పేలవ బ్యాటింగ్ తో డ్రా అవకాశాలనూ దూరం చేసుకుందని తెలిపారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ, "ఈ మ్యాచ్ లో గట్టెక్కడం చాలా కష్టం. మ్యాచ్ ను కాపాడుకోవాలంటే ఎవరైనా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలి. ముఖ్యంగా భారీ భాగస్వామ్యాలు నమోదవ్వాలి. టాపార్డర్ బ్యాట్స్ మెన్ పార్ట్ నర్ షిప్ లు నమోదు చేసి ఉంటే, ఏదన్నా అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ గట్టెక్కుతుందనుకోను. ఒకవేళ మ్యాచ్ ను సురక్షితంగా ముగిస్తే ఎంతో సంతోషిస్తాను" అని పేర్కొన్నారు. కాగా, నాలుగోరోజు సాయంత్రానికి ఒకట్రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఉంటే చివరిరోజు ఆటను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు వీలయ్యేదని సన్నీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News