: ఇంకొకరి మోజులో పడి కోరిక తీర్చలేదని ప్రియురాలిని చంపేశాడు


నాలుగేళ్లు ప్రేమించుకుని, మరొకరి మోజులో పడిన ప్రియురాలు కోరిక తీర్చలేదని ఏకంగా ఆమెను చంపేసిన ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ పరిధిలోని నైవేలి గ్రామంలో చోటుచేసుకుంది. మనవాలనగర్‌లోని లోకిదాస్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న చాముండేశ్వరి (19), రాజ్ కుమార్ ప్రేమించుకుంటున్నారు. నైట్ డ్యూటీకి టైమ్ దగ్గర పడుతుండడంతో కాలకృత్యాలను తీర్చుకునేందుకు సమీపంలోని పొదల్లోకి చాముండేశ్వరి వెళ్లింది. తరువాత ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి కుప్పన్ గ్రామస్థులతో కలిసి సమీప ప్రాంతాల్లో గాలించారు. ముళ్లపొదల్లో చాముండేశ్వరి విగతజీవిగా పడిఉండడం గమనించిన వారు పెనాలూరు పేట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేయడంపై గ్రామస్తులు మండిపడ్డారు. నేరస్తులను అరెస్టు చేసి శిక్షించిన తరువాతే మృతదేహాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించి దర్యాప్తు ప్రారంభించి, మృతదేహన్ని తిరువళ్లూరు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని చాముండేశ్వరి కాల్ లిస్టు తీశారు. దీంతో చివరిగా చాముండేశ్వరి అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో మాట్లాడడంతో పాటు గంటలతరబడి అతనితో ఫోన్ లో గడిపేదని గుర్తించారు. దీంతో అతడిని పోలీసులు ఊత్తుకోట వద్ద అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించారు. దీంతో చాముండేశ్వరి, తాను గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని రాజ్ కుమార్ తెలిపాడు. కాలక్రమంలో చాముండేశ్వరి మనవాలనగర్ ప్రాంతంలో ఉన్న మరో యువకుడితో ప్రేమలో పడి తనను నిర్లక్ష్యం చేస్తోందని గుర్తించాడు. దీంతో చాముండేశ్వరిపై కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ చివరి సారి మాట్లాడాలని పిలిపించి తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. అతడి కోరికను చాముండేశ్వరి తిరస్కరించడంతో బండరాయితో మోది ఆమెను హత్య చేసినట్టు రాజ్ కుమార్ అంగీకరించాడు. దీంతో అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News