: తెలుగు ఇంజినీర్ల కిడ్నాప్ కథ సుఖాంతం
విజయవాడకు చెందిన ఇంజినీర్లు ప్రతీశ్ చంద్ర, రఘులను నాగాలాండ్ తీవ్రవాదులు విడిచిపెట్టారు. దాంతో, వారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తీవ్రవాదులతో రత్న కన్ స్ట్రక్షన్ కంపెనీ నిన్న (బుధవారం) రాత్రి రెండోసారి చర్చలు సఫలంకావడంతో ఇంజినీర్లను విడిచిపెట్టారు. దాంతో, ఈ రోజు ఇంజినీర్లు ఇద్దరూ విజయవాడకు చేరుకోనున్నారు. నాలుగు రోజుల కిందట అపహరణకు గురయిన ఇంజినీర్లకోసం మొదటిసారి జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.