: త్వరలోనే 10వేల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం: కేటీఆర్
హైదరాబాదును వైఫై సిటీగా మార్చాలని నిర్ణయించామని... దీనికోసం సిటీలో అనేక సెల్ ఫోన్ టవర్లు అవసరమవుతాయని టీఎస్ మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనికితోడు, త్వరలోనే 10వేల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 'సెల్ టవర్లు, ఆరోగ్యం' అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ తగిన మోతాదులో ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ కూడా హాజరయ్యారు.