: హామీ నిలబెట్టుకోకపోతే... మోడీని తిరుమల వెంకన్న క్షమించడు
ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీ తరహా రాజధానిని నిర్మిస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ముందు తిరుపతిలో జరిగిన బహిరంగసభలో తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారని... ఆ హామీని ఆయన నిలబెట్టుకోవాలని రాజ్యసభ ఎంపీ సుబ్బిరామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయన తన హామీని నిలబెట్టుకోకపోతే తిరుమల వెంకటేశ్వరుడు మోడీని క్షమించరని ఆయన రాజ్యసభలో తీవ్రంగా హెచ్చరించారు. విభజన వల్ల ఏపీకి కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం వెంటనే రూ.5,000 కోట్లు కేటాయించాలని ఆయన రాజ్యసభలో డిమాండ్ చేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పన్నుల్లో రాయితీలు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని వెంటనే మంజూరు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.