: కడప జిల్లాలో ఎర్రచందనం కూలీలు అరెస్టు
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట వద్ద ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న (బుధవారం) రాత్రి బాపల్లె అటవీ ప్రాంతంలో పోలీసుల కళ్లుగప్పి కూలీలు పరారవడంతో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఉదయం అనంతరాజుపేట రైల్వే స్టేషన్ వద్ద మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.