: డాన్స్ మాస్టర్, నటుడు ముక్కురాజు కన్నుమూత


డాన్స్ మాస్టర్, నటుడు ముక్కురాజు పశ్చిమగోదావరి జిల్లాలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 600 సినిమాల్లో ఆయన నటించారు. ఆయన అసలు పేరు సాయిరాజు రాజంరాజు. 2010లో వచ్చిన '1940లో ఓ గ్రామం' చిత్రంలో నటించిన ముక్కురాజుకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. చివరిగా 2013లో మధసింహం అనే చిత్రంలో ఆయన నటించారు. ముక్కురాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రేపు ఉండి మండలం చెరుకువాడలో రాజు అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News