: 1956 తర్వాత పుట్టడంలో పిల్లల తప్పు ఏముంది... పిల్లల ప్రమేయం ఏముంది?: వీహెచ్


కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. స్థానికత, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో కేసీఆర్ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రా ప్రాంతం వారికి 1956వ సంవత్సరం తర్వాత పిల్లలు పుడితే... అందులో పిల్లల తప్పు ఏముంటుందని... ఈ విషయంలో పిల్లల ప్రమేయం ఏముందని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన సూచించారు. చంద్రబాబు చాలా అనుభవం ఉన్న నాయకుడని... ఆయన విద్యార్థుల భవిష్యత్తును కాపాడతారన్న నమ్మకం తనుకుందని వీహెచ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News