: మరోసారి చంద్రబాబుపై జగన్ ఫైర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేంత సీన్ టీడీపీకి లేదని అన్నారు. కేవలం చంద్రబాబు మోసపూరిత మాటలు, నరేంద్ర మోడీ గాలి వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. దీనికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఒక్కటై ప్రచారం చేసి టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టాయని ఆరోపించారు. అసత్య ప్రచారాలు, మోసపూరిత హామీలను తాను కూడా ఇచ్చి ఉంటే వైకాపా అధికారంలోకి వచ్చి ఉండేదని చెప్పారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రెండు రోజుల గుంటూరు జిల్లా పర్యటనకు గాను జగన్ గుంటూరు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు వెళ్లారు. రెండు రోజుల పాటు స్థానిక అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్ లో గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News