: రూమర్స్ పై హృతిక్ రోషన్ అప్సెట్ అయ్యాడు...!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, భార్య సుజానే రోషన్ పరస్పర అంగీకారంతో విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అదే అవగాహనతో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు కూడా దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో మనోవర్తి కింద భార్య సుజానే రూ.400 కోట్లు అడిగిందంటూ మీడియాలో వస్తున్న వార్తలను హృతిక్ తీవ్రంగా ఖండించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన బాధను వ్యక్తం చేశాడు. "కల్పిత వార్తా కథనాలు ప్రచురిస్తున్నారు. నా ప్రియమైన వ్యక్తిని కించపరుస్తున్నారు. అంతేకాదు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు" అని పోస్టు చేశాడు. ఈ క్రమంలో వస్తున్న కథనాలన్నీ అబద్దమని, అవాస్తవమని చెప్పే ప్రయత్నం చేశాడు.