: మలేరియా పాలిట యమరాజు... మార్కెట్లోకి వస్తోంది


ప్రతి ఏడాది మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో బలవుతున్నారు. వీటిలో 90 శాతం మరణాలు ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలో నమోదవుతున్నాయట. అందులో 77 శాతం ఐదేళ్ళ లోపు చిన్నారులే ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫార్మా సంస్థ జీఎస్కే మలేరియా వ్యాక్సిన్ (ఆర్టీఎస్,ఎస్) రూపొందించేందుకు చేపట్టిన పరిశోధనల్లో సఫలీకృతమైంది. ఈ వ్యాక్సిన్ ను అనుమతించాలంటూ జీఎస్కే... యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ)కి దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ కోసం జీఎస్కే సంస్థ పలు దశల్లో పరిశోధనలు నిర్వహించింది. మూడో దశలో మొత్తం 8 ఆఫ్రికా దేశాల్లోని 13 పరిశోధన కేంద్రాల్లో ప్రయోగాలు చేపట్టింది. ఇందుకోసం 16,000 మంది శిశువులు, బాలలపై పరీక్షలు జరిపింది. ఓసారి టీకా వేస్తే 18 నెలల వరకు మలేరియా ప్రమాదం ఉండదని జీఎస్కే పరిశోధనల్లో తేలింది.

  • Loading...

More Telugu News