: శ్రీశైలం డ్యాంలోకి భారీగా చేరుతున్న వరదనీరు
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 78 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... ఔట్ ఫ్లో 34 వేల క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 831.8 అడుగులకు చేరుకుంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 51.3 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది.