: అత్యాచారాలను నిరసిస్తూ నేడు బెంగళూరు బంద్
ఇండియన్ ఐటీ హబ్, గ్రీన్ సిటీ బెంగళూరులో నేడు బంద్ జరుగుతోంది. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఎక్కువైన నేపథ్యంలో ఈ బంద్ కు పిలుపునిచ్చారు. బెంగళూరులోని విబ్జియార్ హైస్కూలులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరగడంతో నగర ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థలపై నగరవాసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో 'కన్నడ ఒక్కూట' (వివిధ కన్నడ సంఘాల కూటమి) ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.