: లోగో తయారు చేయండి... 50 వేలు గెలుచుకోండి


మీలో ఏ కొద్దిపాటి క్రియేటివిటీ ఉన్నా... భారీ ప్రైజ్ మనీ సొంతం చేసుకోవచ్చు. ఇది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదండోయ్... ఏకంగా కేంద్ర ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే... కేంద్ర ఆర్థిక శాఖ తమ లోగోను డిజైన్ చేసి, లోగో పేరు, లోగో ట్యాగ్ లైన్ సూచించాలంటూ దేశ పౌరులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇందులో బెస్ట్ గా నిలిచిన లోగోకు రూ. 50 వేల బంపర్ ప్రైజ్ ఇస్తామని ప్రకటించింది. ఈ కంటెస్ట్ కు ఆఖరి తేదీ ఆగస్ట్ 7. ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకునే వారు http://mygov.nic.in/index.కు లాగాన్ అవ్వాలి.

  • Loading...

More Telugu News