: శంకర్ దయాళ్ శర్మ వద్దన్నందుకే పీవీ ప్రధాని అయ్యారు!


తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి పీవీ నరసింహారావు. భారత ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఈ రోజు మనదేశం అన్ని రంగాల్లో దూసుకుపోయేలా చేసింది. అయితే, ఆయన ప్రధాని కావడం అనూహ్యంగా జరిగిందని ఇప్పడు వెల్లడయింది. మొదట (1991లో) అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను ప్రధాని చేయాలని సోనియా భావించారట. అయితే, అనారోగ్య కారణాల వల్ల ఆ ఆఫర్ ను శర్మ తిరస్కరించారు. దీంతో ఆ పదవి పీవీ నరసింహారావుకు దక్కింది. మరో విషయం ఏమిటంటే... అప్పటికి పీవీ గురించి సోనియాకు ఏమీ తెలియదట. పీవీ ప్రధాని అయిన తర్వాత కూడా వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడం తెలిసిందే. ఈ వివరాలను కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్'లో పొందుపరిచారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది.

  • Loading...

More Telugu News