: హైదరాబాదులో ఆ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది
హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. అనంతరం ఆ ప్రయాణికుడిని ఎయిర్ పోర్టులోని ఆసుపత్రికి తరలించారు.