: సోనియాను ప్రధానిని కాకుండా అడ్డుకున్నది రాహులేనట


ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ దేశ ప్రధాని కాకుండా అడ్డుకున్నది స్వయానా ఆమె కుమారుడు రాహుల్ గాంధీయేనని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ... సోనియా గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకున్నది రాహుల్ గాంధీయేనని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీని హతమార్చినట్టు సోనియా గాంధీని కూడా ఉగ్రవాదులు హతమారుస్తారేమోననే భయంతో ప్రధాని పదవి చేపట్టవద్దని తల్లిని రాహుల్ కోరారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, సుమన్ దూబే ఉన్నారని నట్వర్ సింగ్ వెల్లడించారు. కుమారుడిగా రాహుల్ ఆవేదన తనకు అర్థమైందని ఆయన తెలిపారు. ఈ విషయం తన ఆత్మకథలో రాయవద్దని ప్రియాంకా గాంధీ కోరారని నట్వర్ సింగ్ చెప్పారు.

  • Loading...

More Telugu News