: టీమిండియా విజయలక్ష్యం 445
మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు విజయలక్ష్యం నిర్దేశించింది. సౌతాంప్టన్ లో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఏడువికెట్ల నష్టానికి 569 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ను 205 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ జట్టు విజయమే లక్ష్యంగా టీ విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి భారత జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్యాట్స్ మన్ విఫలమైన చోట ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ రాణించగా, కుక్ (70), రూట్ (56) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ స్కోరును నిలువరించాడు. ఇంకో రోజు ఆట మిగిలి ఉండగా డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ భారత్ ను బౌన్సర్లతో బెంబేలెత్తించే ప్రణాళికలు రచించింది. ఈ మ్యాచ్ లో గెలుపు సంగతి పక్కన పెట్టి భారత జట్టు డ్రా చేసుకోగలిగితే ఆధిక్యం నిలబడుతుంది. లేదంటే సిరీస్ లో చెరో విజయంతో సమమయ్యే ప్రమాదం ఉంది. భారత జట్టు అందివచ్చిన అవకాశం వినియోగించుకుంటుందో... లేక నిర్లక్ష్యంతో బంగారు అవకాశం చేజార్చుకుంటుందో వేచి చూడాలి. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 330 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.