: బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వరేం?: వీహెచ్
వెనుకబడిన కులాలకు (బీసీ) రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ప్రశ్నించారు. వెనుకబడిన కులాలకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన 27 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన అన్నారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికత సమస్యను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలతో పరిష్కరించుకోవాలని వీహెచ్ సూచించారు.