: వారిద్దరూ సిద్ధహస్తులే...ప్రజలే అప్రమత్తంగా ఉండాలి: వీరభద్రం


ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తులని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ... ప్రజల్లో ఉన్న ఉద్వేగాలను, ఉద్రేకాలను మరింత పెచ్చరిల్లేలా చేసి, అసలు సమస్యలను దారి మళ్లిస్తారని తెలిపారు. వారిద్దరితో రెండు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఉపాధిహామీని వ్యవసాయ కార్మికులకు ముడిపెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News