: కృష్ణాజిల్లాలో మరో దొంగనోట్ల ముఠా అరెస్ట్
కృష్ణాజిల్లాలో మరో దొంగనోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు సభ్యులున్న ఈ ముఠాను గుడివాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.10 లక్షల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా 500 రూపాయల దొంగనోట్లను చలామణి చేస్తూ పోలీసుల చేతికి చిక్కింది. ఇటీవలే జిల్లాలోని కలిదిండిలో ఓ దొంగనోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.