: ఛత్తీస్ గడ్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో టీఎస్ అధికారుల భేటీ
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలును సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ మేరకు వారం రోజుల్లో ఇరు రాష్ట్రాల అధికారులు ఎంఓయూ మీద సంతకాలు చేయనున్నారు. సీపీఏ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.