: ఫ్లిప్ కార్టు 6 వేల కోట్లు అంటే... అమెజాన్.కామ్ 12 వేల కోట్లు అంటోంది!


ఆన్ లైన్ వ్యాపారంలో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ భారత్ లో 6 వేల కోట్లు పెట్టుబడిగా పెడతానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి ఓ రోజు కూడా గడవకుండానే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ 2 బిలియన్ డాలర్లు (12 వేల కోట్ల రూపాయలు) పెట్టుబడులను భారత్ లో పెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చుకున్నట్లు అమెజాన్.కామ్ తెలిపింది. ఈ పెట్టుబడులతో భారీ ప్రణాళికలను రూపొందించడానికి అమెజాన్ సిద్ధమైంది. అంతేకాదు, భారత్ లో భారీ ఎత్తున వినియోగదారులను ఆకర్షించుకునేందుకు ఈ నిధులను వినియోగించుకుంటామని అమెజాన్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఏడాది క్రితం భారత్ లోకి ప్రవేశించిన అమెజాన్.కామ్ కి... దేశంలో ఇప్పటివరకు ఐదు గోడౌన్ లున్నాయి. తమ గోడౌన్ల సామర్థ్యాన్ని 5 లక్షల చదరపు అడుగులకు పెంచాలని అమెజాన్ నిర్ణయం తీసుకుంది. భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగం భవిష్యత్తులో అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తుందని అమెజాన్.కామ్ విశ్వసిస్తోంది. అందుకే భారత్ కు ఈ సంస్థ నిధుల వరద పారిస్తోంది.

  • Loading...

More Telugu News