: జైల్లో అందరిదీ ఒకదారి... సహారా అధినేతది మరోదారి
‘ఊరందరిదీ ఒకదారైతే ఉలిపిరికట్టెది మరోదారి’ అన్నట్టు జైలుకు ఎవరైనా శిక్ష అనుభవించేందుకు వెళ్తారు... కానీ సహారా సంస్థ అధినేత మాత్రం విహారయాత్రకు వచ్చానని అనుకున్నాడో ఏమో కానీ, జైల్లో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జైలులో ఉన్న కారణంగా తన విధులకు ఆటంకం కలుగుతోందని, అలా ఆటంకం లేకుండా ఉండేందుకు తనకు వైఫై, వీడియో కాన్ఫరెన్సు సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషనుపై జైలు అధికారులనూ, సుబ్రతోరాయ్ లాయర్లను సుప్రీం న్యాయమూర్తి విచారించారు. దీనిపై సమీక్ష నిర్వహించాలని జైలు అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. వివరాలన్నీ అందించిన తరువాత దీనిపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.