: ఆగస్టు 1న విజయవాడకు వస్తున్న సచిన్, నటి అనుష్క
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, టాలీవుడ్ అందాల భామ అనుష్క ఆగస్టు 1న విజయవాడకు వస్తున్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీఫ్లెక్స్ 'పీవీపీ స్వ్కేర్'ను సచిన్ ప్రారంభించనుండగా, అనుష్క ముఖ్య అతిథిగా పాల్గొంటుంది. అట్టహాసంగా జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినిమా, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.