: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కుదేల్... గట్టెక్కాలంటే అద్భుతం జరగాల్సిందే!
సౌతాంప్టన్ టెస్టులో టీమిండియా పరువు కాపాడుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ సాధించిన 569/7 స్కోరుకు బదులుగా భారత్ 330 పరుగులకు ఆలౌటైంది. ఆండర్సన్ 5 వికెట్లతో భారత్ వెన్ను విరిచాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టు వికెట్ నష్టానికి 23 పరుగులతో ఆడుతోంది. దీంతో ఇంగ్లండ్ ఓవరాల్ ఆధిక్యం 262 పరుగులు కాగా, ఆటకు నేడు నాలుగోరోజు. నేటి సాయంత్రానికి ఇంగ్లండ్ జట్టు మరో వంద పరుగులు జతచేసి భారత్ ను బ్యాటింగ్ కు దింపే అవకాశం ఉంది. భారత్ ఫాలో ఆన్ లో పడినా తాము బ్యాటింగ్ చేసేందుకే ఇంగ్లండ్ జట్టు సారథి కుక్ నిర్ణయించుకున్నాడు.