: మావోయిస్టుల బలం ఇదీ... కేంద్రం అంచనా


కొన్నాళ్ళ కిందటితో పోల్చితే దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గినట్టే భావించాలి. దక్షిణాది రాష్టాల్లో ఉనికి కోసం వీరు నానాపాట్లు పడుతున్నారు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర సరిహద్దులు, దండకారణ్యంలో మాత్రం నక్సల్స్ అలికిడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం దేశంలో ఉన్న మావోయిస్టుల సంఖ్యపై ఓ అంచనాకొచ్చింది. మొత్తమ్మీద 8,500 మంది ఉద్యమంలో ఉన్నట్టు భావిస్తున్నామని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు. బయటిప్రపంచంలో వారి సానుభూతిపరుల సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాకుండా మావోయిస్టులు ఈశాన్య భారతంలోని పలు మిలిటెంట్ గ్రూపులతో చేయి కలిపినట్టు కేంద్రం అనుమానిస్తోంది.

  • Loading...

More Telugu News