: నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ పై ఆగస్టు ఒకటిన కోర్టు విచారణ చేపట్టనుంది. పార్టీ తరపున సీనియర్ నేత కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి కేసును వాదించనున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ఆధారంగా కొన్ని రోజుల కిందట ఢిల్లీలోని మేజిస్ట్రేట్ కోర్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. అనంతరం ఆదాయపన్ను శాఖ కూడా కాంగ్రెస్ పార్టీకి నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు.

  • Loading...

More Telugu News