: యూకేలో ముస్లింల ఖాతాలు నిలిపివేసిన హెచ్ఎస్బీసీ బ్యాంకు
యూకేలో హెచ్ఎస్బీసీ బ్యాంకు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. ముస్లిం సంఘాలు, ముస్లిం వ్యక్తులకు చెందిన ఖాతాలను బ్యాంకు నిలిపివేసింది. ఈ మేరకు బ్యాంకు అధికారులు లండన్ లోని అతి పెద్దదైన ఫిన్స్ బరీ పార్క్ మసీదు, ఇస్లామిక్ మేధావి వర్గం సహా పలు ముస్లిం సంస్థలకు లేఖ రాశారు. ఈ ఖాతాలు కొనసాగించడం బ్యాంకు ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని హెచ్ఎస్బీసీ ఆ లేఖలో పేర్కొంది. మత, జాతి పరమైన కారణాలతో నిలిపివేత నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. దీనిపై ఫిన్స్ బరీ పార్క్ మసీదు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మసీదు ట్రస్టీల్లో ఒకరైన ఖాలిద్ ఉమర్ మాట్లాడుతూ, బ్యాంకు నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించారు. ఖాతాల నిలిపివేతకు సరైన కారణం చెప్పలేకపోయారని విమర్శించారు. వారికి ఇస్లామోఫోబియా పట్టుకున్నట్టుందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఉమర్ పేర్కొన్నారు.