: కృష్ణమ్మ కళకళ... గోదావరి గలగల
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే... గోదావరి గలగలా పారుతోంది. ఆల్మట్టి డ్యాంలో లక్షా 9 వేల క్యూసెక్కుల వరదనీరు చేరింది. దాంతో, దిగువనున్న నారాయణపూర్ జలాశయానికి 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ డ్యాం నుంచి దానికి దిగువనున్న జూరాల ప్రాజెక్టుకు 36 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. గోదావరి నది వరదనీటితో జలకళను సంతరించుకుంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 4.09 లక్షల క్యూసెక్యుల వరదనీరు చేరింది. దీంతో గొట్టా బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. ఇప్పటికే 294 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది.