: ఆంధ్రా ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ వారం రోజులే
ఆంధ్రా ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా క్వార్టర్లు ఖాళీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ క్వార్టర్స్ అలాట్ మెంట్ కమిటీ ఛైర్మన్ రామలింగారెడ్డి డెడ్ లైన్ విధించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆదేశాల ప్రకారం నడుచుకోకుంటే విద్యుత్, నీటి కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరించారు. రెండు ప్రాంతాలకు వేర్వేరు క్వార్టర్లు కేటాయించినా ఆంధ్రా ప్రాంతం ఎమ్మెల్యేలు ఖాళీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రనేతలు రాష్ట్రం వీడినా క్వార్టర్లు వీడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.