: రైల్లోంచి పడిపోయినా... బతికి బట్ట కట్టారు


కదులుతున్న రైల్లోంచి ప్రమాదవశాత్తు పడిపోయినా... వారిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లా బయ్యవరం వద్ద చోటు చేసుకుంది. విశాఖ-రాజమండ్రి ప్యాసింజర్ నుంచి ఇద్దరు ప్రయాణికులు కింద పడిపోయారు. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై... రైలును 2 కి.మీ. వెనక్కి నడిపారు. ఆ ఇద్దరూ ప్రయాణికులు స్వల్పగాయాలతో తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News