: కోటి రూపాయలు పోగేసి... వాటితో ఉడాయించిన బ్యాంక్ మేనేజర్


చిత్తూరు జిల్లాలోని ఓ బ్యాంకులో భారీ స్కామ్ జరిగింది. జిల్లాలోని సత్యవేడులోని సప్తగిరి సహకార బ్యాంకులో పొదుపు సంఘాల మహిళలు రూపాయి రూపాయి కూడబెడుతూ... ఆ డబ్బులను బ్యాంకులో దాచుకున్నారు. అయితే, ఆ బ్యాంక్ మేనేజర్ ఆ డబ్బులను ఖాతాల్లో జమ చేయకుండా పక్కన పెట్టడం ప్రారంభించారు. ఆ మొత్తం కోటి రూపాయలు కాగానే సొమ్ముతో ఉడాయించారు. జరిగిన మోసాన్ని తెలుసుకున్న పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు సిబ్బందిని నిర్బంధించారు. బ్యాంకులో వారు ఉండగానే బయట తాళాలు వేసి... తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పారు. మేనేజర్ ను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మహిళలు తమ ఆందోళనను విరమించారు.

  • Loading...

More Telugu News