: ఆంధ్రా వాహనాలకు పర్మిట్ ట్యాక్స్ విధింపుపై మంత్రి శిద్దా స్పందన
ఆంధ్రాకు చెందిన వాణిజ్య రవాణా వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాలంటే పర్మిట్ ట్యాక్స్ చెల్లించాలంటూ టీఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మంత్రి శిద్దా రాఘవరావు స్పందించారు. పన్ను విధింపుపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అన్నారు. గవర్నర్ నిర్ణయం మేరకు 2015 మార్చి వరకు పన్ను విధించడం సరికాదన్నారు.