: ఒక చెట్టు... 40 రకాల పళ్లు


అమెరికాకు చెందిన శామ్ వాన్ అకెన్ బొటానికల్ సైన్స్ లో ఓ అద్భుతాన్ని సృష్టించాడు. సైరక్యూస్ యూనివర్శిటీలో ఆర్ట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శామ్ వాన్ అంటుకట్టు విధానం ద్వారా 40 రకాల పండ్లను ఇచ్చే ఓ చెట్టును రూపొందించాడు. 2008 లో శామ్ వందలాది చెట్లు ఉన్న ఓ తోటను కొన్నాడు. ఈ తోటను కొన్న తర్వాత తోటలో ఉన్న రకారకాల చెట్లతో అంటుకట్టు విధానం చేయడం మొదలుపెట్టాడు. ఈ విధానంలో ముందు అంటుకట్టేందుకు ఎంపిక చేసిన చెట్టు కొమ్మను మొగ్గ లేకుండా వేరు చేసి... దానిని మరో చెట్టు కాండంపై గాటు పెట్టి... అందులో ప్రవేశపెట్టి గాలి తగలకుండా పాలీథీన్ కవర్ చుడతారు. ఇదే విధానాన్ని ఆరేళ్ల పాటు రకరకాల చెట్లతో చేస్తే... 40 విభిన్న రకాల పండ్ల మొక్క ఆవిష్కృతమైంది. ఈ చెట్టు ఒక్క వసంతకాలం తప్ప... మిగతా అన్ని కాలాల్లోను మాములు చెట్లు లాగే ఉంటుంది. అయితే, వసంతకాలంలో మాత్రం తన అసలు స్వరూపాన్ని చూపెడుతుంది. వసంతకాలంలో మాత్రం తెలుపు, ఎరుపు, లేత ఎరుపు, ఊదా రంగుల్లో చూడముచ్చటగా దర్శనమిస్తుంది. ఈ 40 పండ్ల మొక్కలో రేగు, బాదం, సీమబాదం, ఛెర్రీలు, పీచుపండు, ఆల్ బకరా లాంటి నోరూరించే పళ్లు కాస్తున్నాయి.

  • Loading...

More Telugu News