: ప్రేమించలేదని సహ విద్యార్థినిని కత్తితో పొడిచిన విద్యార్థి
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ఆర్ కే డిగ్రీ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదన్న కారణంతో తోటి విద్యార్థినిని సాయి అనే విద్యార్థి కత్తితో పొడిచాడు. తర్వాత అటు తను కూడా పొడుచుకున్నాడు. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.