: అక్కడ మహిళలు పెద్దగా నవ్వరాదట!


టర్కీలో మహిళలపై ఆంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో పెద్దగా నవ్వరాదని ఉపప్రధాని బులెంట్ అరింక్ సెలవిచ్చారు. ఆధునిక సమాజంలో నైతిక విలువలు ఎలా పతనం అవుతున్నాయో వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా మాట్లాడుతూ, "పురుషుడూ నైతిక విలువలు పాటించాలి, అదే విధంగా మహిళలు కూడా నైతిక ప్రవర్తనతో నడుచుకోవాలి. ఏది సభ్యత? ఏది అసభ్యత? అన్న విషయం వారు తెలుసుకోవాలి. ఓ స్త్రీ అందరి ముందూ పెద్దగా నవ్వరాదు. అన్నివేళలా ఆమె తన గౌరవాన్ని కాపాడుకోవాలి" అని వివరించారు. కాగా, డిప్యూటీ పీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నిరసనలు పెల్లుబికాయి. నీతులు చెప్పడం మానుకోవాలంటూ సామాజిక ఉద్యమకారులు ఆయనకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News