: నాగాలాండ్ తీవ్రవాదుల చెరలోనే తెలుగు ఇంజినీర్లు
తెలుగు ఇంజినీర్ల కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విడుదలవుతున్నారనుకున్న విజయవాడ ఇంజినీర్లు ప్రతీశ్ చంద్ర, రఘు ఇంకా నాగాలాండ్ తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. వారిద్దరు పనిచేస్తున్న పృథ్వీ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ నిన్న (మంగళవారం) తీవ్రవాదులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, అందుకే ఇంజినీర్లను మళ్లీ బంధించారని విజయవాడలోని కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నాపర్ల డిమాండ్ లకు కంపెనీ ప్రతినిధులు కొంత విముఖత తెలపడంతో విడిచిపెట్టాలనుకుని కూడా ఇంజినీర్లను బంధించినట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ అధికారులు తమను మోసం చేశారని ఇంజినీర్ల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.