: కుంభకోణం అగ్ని ప్రమాదం కేసులో పదిమందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు
తమిళనాడు కుంభకోణంలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో తంజావూర్ జిల్లా కోర్టు పదిమందిని దోషులుగా నిర్ధారించింది. వీరిలో పాఠశాల యజమాని కూడా ఉన్నాడు. మరో ముగ్గురు ఉపాధ్యాయులు సహా పదకొండు మందిని నిర్దోషులుగా తేల్చింది. 2004, జులై 16న జరిగిన ఈ ఘటనలో 94 మంది చిన్నారులు మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.