: రష్యాపై ఆంక్షలను మరింత విస్తరించిన అమెరికా
రష్యాపై అగ్రరాజ్యం అమెరికా సరికొత్త ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో... రష్యాకు చెందిన ఎనర్జీ, ఆయుధాలు, ఆర్థిక రంగాలపై ఆంక్షలను మరింత విస్తరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా వెల్లడించారు. రష్యా తన విధానాన్ని మార్చుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని... దీంతో ఆ దేశం భవిష్యత్తులో మరింత కోల్పోవాల్సి వస్తుందని ఒబామా అన్నారు. ఇప్పటికే రష్యాపై కొన్ని ఆంక్షలున్నప్పటికీ... తాజాగా మూడు కీలక రష్యా బ్యాంకులు, రక్షణ సంస్థలు, ఎనర్జీ రంగానికి చెందిన సంస్థలకు ఆంక్షలను విస్తరింపజేశారు. అంతేకాకుండా రష్యా ఎనర్జీ సెక్టార్ కు కీలకమైన పరికరాలు, టెక్నాలజీపై కూడా ఆంక్షలను విధించారు. ఆంక్షలు విధించిన మూడు బ్యాంకులకు ఇకపై అమెరికన్ల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. ఈ వివరాలను జిన్హువా వెల్లడించింది. మలేషియా విమానాన్ని కూల్చి 298 మంది మృతికి కారణమైన ఉక్రెయిన్ మిలిటెంట్లకు రష్యా సహకారం అందిస్తోందని యూఎస్ ఆరోపిస్తోంది.